Saturday, July 9, 2011

Brindavanam Songs HD - Oopirage - NTR, Kajal Agarwal and Samantha

Saturday, October 30, 2010

16 అణాల తెలుగు అమ్మాయి


16 అణాల తెలుగు అమ్మాయి

సూర్యోదయంలో ఉషస్సుని ,
చంద్రోదయంలో వెన్నెలని ,
వీచే గాలిలో హాయిని ,
పారే గోదావరి గలగలని ,
మెరిసే చుక్కల తలుకులని ,
కురిసే వాన జల్లులని ,
అమ్మ ఒడిలోని వెచ్చదనాన్ని ,
నాన్న పంచిన ప్రేమని ,
ఎన్నో కలలతో ,
మరెన్నో కోరికలతో ,
అంతులేని ఆత్మాభిమానంతో ,
అర్ధంకాని అమాయకత్వంతో ,
స్వచమయిన మనసుతో ,
అచ్చ తెలుగు సోయగాలతో ,
కొంటెగా అల్లరిచేస్తూ ,
కసిగా పోట్లదేస్తూ ,
నవ్వుతు నవ్విస్తూ ,
అరుస్తూ అరిపిస్తూ ,
కోపంలో అలుగుతూ ,
బాధలో ఓదారుస్తూ ,
మొండిగా వాదిస్తూ ,
నచ్చిందే చేస్తూ ...,
ప్రేమను పంచె మనసతో ...,
ప్రేమను గెలుచుకునే సహనం తో ...,
కలగలిసిన అచ్చమైన బాపు బొమ్మ
మన 16 అణాల తెలుగు అమ్మాయి.

Saturday, February 20, 2010

నీ పిలుపు కోసం వేచిచూస్తున్నా

నిన్నలా , మొన్నలా నువ్వున్నా
నేడు ఏదో తెలియని ఆలాపన నాలోన
నీ శ్వాసలు తాకితేనే నన్ను నేను మైమర్చిపోతున్నా
నీ అడుగుల సవ్వడిలో ప్రతిరోజు గడపాలనుకుంటున్నా
నీ చిరునవ్వుల వేకువ కోసం నిరీక్షణ చీకటిన్ని భరిస్తున్నా
నీ మాటల చిరుజల్లుకే పుడమిలా పులకరిస్తున్నా
నీ ఒరచూపుకే నన్ను నేను భానిసను చేస్తున్నా
నువ్వు నాకు దగ్గరవుతున్న క్షణమైనా అలా నిలిచిపోవలనుకుంటున్నా
నువ్వు దూరమై అర క్షణమైనా విరహవేదన భరించలేకున్నా
ఇంకా ఎన్నో చెప్పలేని భావాలు కలుగుతున్నా
ఎందుకో తెలియక సతమమవుతున్నా
అందుకే నా వేదనను నీకు తెలియజేస్తూ నీ పిలుపు కోసం వేచిచూస్తున్నా

నీ ప్రేమ కోసం

నీ ప్రేమ కోసం
కన్నీరే నాకు మిగిల్చినా

కరిగిపోదు నా కంటి పాప లో నీ రూపం

నీ ఎడబాటు నా బాట గా మార్చినా

ఆగదు నీ జ్ఞాపకాల బాట లో నా పయనం
నా మాటలన్ని దోచుకొన్ని మూగన్ని చేసినా
ఆపలేను నీ ఉసులు పలకడం

నీ ఉహల తెరచాప ను చీల్చి నడిసంద్రం లో నిలిపిన

చేర్చుతాను నా హృదయ నావ ను నీ ప్రేమ తీరం

నా ఆశల సెలయేరు ను ఎండమావి గా చేసినా

ఆగదు నా ఆన్వేషణ నీ చిరునవ్వు తడికోసం

నీ విరహ వేదన లో ప్రతి క్షణం మరణిస్తున్నా

జన్మిస్తున్నా మరుక్షణం నీ ప్రేమ కోసం


నువ్వు నువ్వు

కన్నుల వెనుక స్వప్నం నువ్వు
నా మాటల వెనుక మౌనం నువ్వు
నా శ్వాసల వెనుక స్పందన నువ్వు
నా విజయం వెనుక శ్రమ వి నువ్వు
నా భాధల వెనుక కన్నీరు నువ్వు
నా గమ్యం వెనుక పయనం నువ్వు
నా రేపటి వెనుక నిన్నటివి నువ్వు
ఇలా
నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడువి నువ్వు.

 

Tuesday, January 26, 2010

ధనం" ఉంటే "జనం" ఉంటారు

ధనం" ఉంటే "జనం" ఉంటారు - "ఆత్మీయులు" ఉండరు
కొట్టినా తిట్టినా పడి ఉన్నారు అంటే "ధనం" గోప్పతనమేగాని "నీ" గొప్పతనం కాదు
"ధనం" తో సాధించడం గొప్పకాదు "తెలివి" తో సాధించడం గొప్ప
తిన్నది కరిగిపోతుంది . చేసిన మేలు మిగిలిపోతుంది .
విశాలమైన భావంతులకంటే - విశాలమైన హృదయం ముఖ్యం
"అందం" కాదు ముఖ్యం - ఆనందాన్ని పంచే "మనసు" ముఖ్యం

వేదాలు తెలుపని సత్యం, శాస్రాలు పలుకని ఆచారం
కాలాలు చూడని కావ్యం, గ్రహాలు తిరగని గమనం
పండితులు చదవని శాస్రాం, కవులు వ్రాయని గ్రంధం

మన స్నేహం

కన్నులు తెలిపె సత్యం, మనసులు పలికె ఆచారం
భావలు రాసే కావ్యం, మోనాలు రాసే గ్రంధం
మాటలు చెసే యుద్దం

అదె మన స్నేహం

నీ స్నెహం ఇకరాను ఇది కరిగే కలగా అయినా
ఈ దూరం నువురాకు అని నను వెలివెస్తు ఉన్నా
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే



ఆనందం చెప్పా లేనిది....,
సంతోషం పట్టరానిది......,

కోపం పనికిరానిది.......,

ప్రేమ చెరిగిపోనిది.......,
కాని...

స్నేహం మరువలేనిది

Wednesday, January 20, 2010

మరణం సహజమే కానీ అది బలవన్మరణం కాకూడదు

మరణం సహజమే కానీ అది బలవన్మరణం కాకూడదుPending approval

అమ్మ కలిపిన కమ్మని గోరుముద్దల జ్ఞాపకాలు
ప్రేమ పంచిన తియ్యని అనుభూతుల సరిగమలు
వేల మనసులు ఒక్కచోట సృస్టించే ప్రేమ శృతిలయలు

మనసుకి నచ్చిన ఒక తోడు కనులకి వేడుక చేస్తే ఎలాంటి వారికైనా
పరిచయం లేని పదాల పువ్వులు భావాల దారంతో
కలిసి కవితల హారమై ప్రేమ మెడలో వేస్తాయి..అందుకే..

బాష కరువైన మనసు చుట్టూ
భావాలూ అల్లే అందాల బొమ్మరిల్లు
అలసి సొలసిన హృదయం కోసం
పదాలు జల్లే పరిమళాల పన్నీటి జల్లు
నిద్దుర రాని కన్నుల కోసం
కను రెప్పలు చెప్పే ముచ్చట్ల హరివిల్లు
ప్రేమించే వేల గుండెల కోసం
బందాలు కట్టే అనుబంధాల పొదరిల్లు